అక్షర ప్రయాణం: "ఊర్మిళ ఉమెన్స్ హాస్టల్" ముగింపు.. ఒక కొత్త ఆరంభం!
రచన అనేది ఒక ఏకాంత ప్రయాణం అనుకుంటాం కానీ, అది కొన్ని వేల హృదయాలను కలిపే అద్భుతమైన వంతెన అని నాకు ఈ ప్రయాణంలో అర్థమైంది. 'ఊర్మిళ ఉమెన్స్ హాస్టల్'.. నా కలం నుండి జారిన కొన్ని సిరా చుక్కలు, ఈరోజు మీ ఆదరణతో ఒక అందమైన జ్ఞాపకంగా మారింది. పాఠకుల ప్రేమ - నా బలహీనత, నా బలం! ఒక కథకు ముగింపు పలికేటప్పుడు రచయిత మనసులో ఎన్నో సందేహాలు ఉంటాయి. "నేను చెప్పాలనుకున్నది సరిగ్గా చెప్పానా? ఆ ఉత్కంఠను చివరి వరకు తీసుకెళ్లగలిగానా?" అని. కానీ మీరు ఇచ్చిన సమీక్షలు చూస్తుంటే ఆ సందేహాలన్నీ మంచులా కరిగిపోయాయి. "ఊహించని క్లైమాక్స్" అని కొందరు, "అప్పుడే అయిపోయిందా?" అని మరికొందరు అంటుంటే.. నా అక్షరాలకు ప్రాణం పోసిన తృప్తి కలిగింది. ప్రతిలిపిలో మీరు అందించిన ఆ 5-స్టార్ రేటింగ్స్, ఆత్మీయమైన కామెంట్స్.. కేవలం అంకెలు కావు, అవి ఒక రచయితగా నాపై మీరు ఉంచిన నమ్మకం. ఆ నమ్మకమే నన్ను రేపటి కొత్త కథ వైపు నడిపిస్తోంది. ముగింపు ఒక మలుపు మాత్రమే.. ఈ ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. మీ అరచేతిలో, మీ స్మార్ట్ ఫోన్లలో ఎపిసోడ్లుగా పలకరించిన ఈ నవల, త్వరలోనే పుస్తక రూపం దాల్చబోతోంది. అమెజాన్ కిండిల్ (Am...